తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒకప్పటి నటి నయనతార ఒకరు. తన సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమను ఓ ఊపు ఉపేసింది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ సాధించింది. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ నయనతార హీరోయిన్ గా రాణిస్తూ ఉండడం విశేషం. ఈ భామ దాదాపు తెలుగు, హిందీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి ఆగ్ర హీరోయిన్ల జాబితాలో ఒకరిగా నిలిచింది. నయనతార అత్యధిక రెమ్యూనరేషన్ వసూలు చేసే హీరోయిన్లలో ఒకరు. 

నయనతార సినిమాలలో నటిస్తున్న సమయంలోనే బాలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్ అందుకుంటుంది. నయనతార లేడీ సూపర్ స్టార్ గా కూడా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ భామ ఎప్పుడు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే నయనతార తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ప్రస్తుతం నయనతార వేరే సినిమాలలో బిజీగా ఉండడంతో సినిమా షూటింగ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నారు.

హీరో చిరంజీవితో కలిసి నటించబోయే సినిమాలో నయనతార భారీగా డబ్బులను డిమాండ్ చేసింది. అది కూడా ఏకంగా రూ. 18 కోట్లు అని అనేక రకాల వార్తలు వచ్చాయి. తాను అడిగిన మొత్తంలో ఇవ్వడానికి నిర్మాత ఒప్పుకోలేదట. నయనతార పారితోషికాన్ని కేవలం ఆరు కోట్లకు మాత్రమే ఫైనల్ చేశారు. ఆరు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని నటించడానికి నయనతార కూడా ఒప్పుకున్నారట. ఈ విషయం తెలిసి కొంతమంది అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటే నయనతార బ్రాండ్ వాల్యూకి దెబ్బ అని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది చిరంజీవి సినిమా రీజనల్ మూవీ కాబట్టే నయనతార అంత తక్కువ రెమ్యూనరేషన్ కి ఒప్పుకుందని అంటున్నారు. టాక్సిక్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు ఆమె అత్యధికంగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందని చిరంజీవితో కాబట్టి ఇంత తక్కువ రెమ్యూనరేషన్ కి చేయడానికి ఒప్పుకుందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో నయనతార క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: