
రాజ్ నిడుమూరు తో కలిసి దిగిన ఫోటోలను వరుసగా షేర్ చేస్తూ నిరంతరం వార్తలలో నిలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరొకసారి అతనితో క్లోజ్ గా దిగి మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. శుభం సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ పైన సమంత ఈ పోస్టులు షేర్ చేసినట్లు సమాచారం. ఇందులో రాజ్ నిడుమూరు తో కలిసి చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా రాజ్ భుజం పైన వయ్యారంగా తలవాల్చి మరి సెల్ఫీ దిగుతూ ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో చూసిన వారంతా కూడా సమంత రిలేషన్ను కన్ఫర్మ్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తెరకెక్కించిన వారిలో రాజ్ నిడుమూరు కూడా ఉన్నారు. అందులో సమంత కూడా నటించింది. అప్పట్లో ఈ వెబ్ సిరీస్ వల్లే నాగచైతన్య, సమంత విడిపోయారనే విధంగా వార్తలు వినిపించాయి. ఇక అప్పటినుంచి వీరిద్దరూ మల్లి ఎక్కడ కలిసి కనిపించలేదు. కానీ ఇప్పుడు శుభం సినిమా నుంచి మళ్లీ వీరిద్దరూ ట్రెండింగ్ లో కనిపిస్తూ ఉన్నారు. అటు సమంత, రాజ్ రిలేషన్ పైన పలు రకాల రూమర్స్ వస్తున్నప్పటికీ ఈ విషయం పైన మాత్రం ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. మరి ఈ విషయంపై సమంత క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.