
నిజం చెప్పాలి అంటే సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఇప్పుడు ఆయన అనిల్ రావిప్పుడు దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు . ఆ కారణంగానే ఈ సినిమా విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైస్ కాకుండా పక్క ప్రాణాలతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆయన పక్కన హీరోయిన్గా ఎవరు బాగుంటారా..? అంటూ రకరకాలు చర్చలు మొదలయ్యాయి . అనిల్ రావిపూడి కూడా చాలామంది హీరోయిన్స్ ని అనుకున్నారట .
ఫైనల్లీ ఆ ప్లేస్ లోకి నయనతార కన్ఫర్మ్ అయింది . నయనతార ఊరికే ఏమీ హీరోయిన్ రోల్ ఒప్పుకోలేదు . దాదాపు ఈ సినిమా కోసం 12 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. నిజానికి అనిల్ రావిపూడి అంత భారీ బడ్జెట్ పెట్టడు . ఈ క్రమంలోనే మెగాస్టార్ మేటర్ లోకి ఇన్వాల్వ్ అయి నయనతార కు ఫోన్ చేసి పాత చనువుతో ఆమెతో రెమ్యూనరేషన్ గురించి డిస్కస్ చేసి రెమ్యూనరేషన్ తగ్గించుకునేలా మాట్లాడరట. ఫైనల్ ఎనిమిది కోట్లకు డీల్ కుదుర్చుకున్నారట. నిజానికి మెగాస్టార్ చిరంజీవి రేంజ్ వేరే లెవెల్. ఆయన రేంజ్ కి ఇలా ఒక హీరోయిన్ తో మాట్లాడాల్సిన అవసరమే లేదు . కానీ అనిల్ రావిపూడి సినిమా హిట్ అవ్వాలి అంటూ మెగాస్టార్ ఒక స్టెప్ డౌన్ వేసి సిగ్గు - రోషం - పౌరుషం అంటూ విర్రవీగకుండా సినిమా కోసం ఏమైనా చేయగలగాలి అదే హీరోయిజం అంటూ భావించి నయనతారకు రెమ్యూనరేషన్ విషయంలో తగ్గించుకోవాలి అంటూ రిక్వెస్ట్ చేశారట . నయనతార కూడా చిరంజీవితో ఉన్నచనువ్వుతో ఫ్రెండ్షిప్ కారణంగా రెమ్యూనరేషన్ తగ్గించుకొని 12 కోట్లను ఎనిమిది కోట్ల వరకు కుదించిందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!