గత కొన్నేళ్లుగా లవ్ చిత్రాలతో  ప్రేక్షకులను అలరిస్తూ ఉన్న హీరో రామ్ పోతినేని మళ్లీ తన పాత రూట్ కి వెళ్లి మాస్ సినిమాలతో అదరగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఇప్పటికే హీరో రామ్ మాస్ చిత్రాలలో నటించారు. తాజాగా రామ్ తన 22వ సినిమాని మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ పై మహేష్ బాబు డైరెక్షన్లో అనౌన్స్మెంట్ చేశారు.ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తూ ఉండగా అలాగే కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రంలో హీరో ఉపేంద్రకు వీర అభిమానిగా రామ్ కనిపించబోతున్నారు. తాజాగా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఈ గ్లింప్స్ లో చూపించారు. ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ని ప్రకటించారు.అలాగే బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ ని కూడా చూపించడం జరిగింది. గ్లింప్స్ విషయానికి వస్తే థియేటర్ ఓనర్ కి టికెట్ల కోసం పలుకుబడి ఉన్న నేతలు,అధికారులు ఫోన్ చేస్తూ ఉండగా చివరికి టికెట్లు విషయంలో విసిగిపోయిన ఓనర్ ఫోన్ నే పక్కకి పెట్టేస్తారు.. కానీ ఒక వ్యక్తి డోరు కొట్టి అన్నా టికెట్ అని అడగగా.. ఎవరి తాలూకా అని  అడగగా ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పగానే థియేటర్ ఓనరే వచ్చి మరి టికెట్లు ఇచ్చినట్టుగా గ్లింప్స్ లో చూపిస్తున్నారు.


గ్లింప్స్ లో హీరో రామ్ చాలా మాస్ గా కనిపిస్తున్నారు. చివరిలో ఉపేంద్ర కటౌట్ కూడా భారీగా చూపించారు. ఈ కటౌట్ దగ్గర వెళ్లి రామ్ నానా హంగామా చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ని చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేశారు. అలాగే ఇందులో లవ్ స్టోరీ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉండబోతుందన్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నిలబడిన నియోజకవర్గం పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురం ప్రజలు ఎమ్మెల్యే గారి తాలూకా అని చెబుతున్నారని.. వాటిని ఇన్స్పైర్ గా తీసుకొని ఈ సినిమాకి ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: