చాలా రోజుల నుండి సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో డేటింగ్ లో ఉంది అని సామాజిక మాధ్యమాల్లో ఎంత వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా కూడా సమంత నిడిమోరు ఇద్దరు కలిసే వెళ్లడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా సమంత తన సినిమా ప్రమోషన్స్ కి ముందు తిరుమల కి వెళ్లిన అక్కడ కూడా రాజ్ నిడిమోరు కనిపించారు. అలాగే సినిమా ప్రమోషన్స్ లో ప్రతి చోటా రాజ్ నిడిమోరుతో కలిసి వెళ్ళింది. అలాగే తన ఇంట్లో కూడా రాజ్ నిడిమోరు ఉన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు. ఇదేంటి తమ మధ్య ఉన్న రిలేషన్ ని బయట పెట్టకుండానే ప్రశ్నార్థకంగా వదిలేస్తూ ఆయనతో మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

అసలు సమంత రిలేషన్ పై ఎవరికి కూడా క్లారిటీ లేదు. ఆయనతో డేటింగ్ లో ఉన్నట్టా లేనట్టా..  రెండో పెళ్లి చేసుకుంటున్నట్టా లేదా అనేది క్లారిటీ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు.అయితే ఇలాంటి వేళ తాజాగా రాజ్ నిడిమోరు భార్య సంచలన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ చూసినా నెటిజెన్లు సమంత రాజ్ నిడిమోరుల రిలేషన్ గురించే రాజ్ భార్య శ్యామలా దే ఇలా పరోక్షంగా పోస్టు పెట్టింది అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ రాజ్  నిడిమోరు భార్య పెట్టిన పోస్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. రాజ్ నిడిమోరు భార్య శ్యామలా దే తన సోషల్ మీడియా ఖాతాలో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది.

 ఇక ఆ పోస్టులో ఏముందంటే.. నాకోసం మాట్లాడే వారు.. చదివే వారు..వినిపించే వారిని..నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా..నా ఆశీర్వాదాలు ఎప్పటికీ వారికి అందిస్తూనే ఉంటా అంటూ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు గత కొద్దిరోజుల నుండి రాజ్ నిడిమోరు సమంత డేటింగ్ వార్తల నేపథ్యంలో సమంత కారణంగా రాజ్ నిడిమోరు తన భార్యకి దూరమయ్యాడని ఆమెకు మద్దతుగా కొన్ని వార్తలు రాశారు అయితే ఈ వార్తలు రాసే వారి కోసమే శ్యామలా దే ఇలా పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: