యాంకర్ అనసూయ సినిమాలకి ముందు యాంకర్ గా కొన్ని షోలు చేసే సక్సెస్ఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నాక సినిమాల్లోకి వచ్చి విలక్షణ పాత్రలు పోషిస్తుంది.అలా అనసూయ చేసిన పాత్రల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు రంగమ్మత్త, ద్రాక్షాయిణి.. ఈ రెండు పాత్రల్లో రంగమ్మత్త రోల్ అనసూయ సినీ కెరియర్లోనే ఒక మైలు రాయిగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి అనసూయ తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఆ వ్యక్తి అడిగిన క్వశ్చన్ కి రామ్ చరణ్ తో డేటింగ్ చేస్తా అంటూ ఈమె మాట్లాడడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఏం అడిగారు.. అనసూయ ఎందుకు అలా ఆన్సర్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.

 యాంకర్ అనసూయ సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీలో రంగమ్మత్త అనే కీ రోల్ పోషించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ వేషధారణకి చాలామంది ఫిదా అయిపోయారు. ఇక ఈ పాత్ర ద్వారా అనసూయ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ కూడా లభించింది. అయితే అలాంటి అనసూయ ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో చేసిన రామ్ చరణ్ తో డేటింగ్ చేస్తాను అంటూ తాజాగా సోషల్ మీడియాలో షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో సందడి చేసే అనసూయ తాజాగా అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొంది.ఇందులో భాగంగా ఓ నెటిజన్ నీకు ఛాన్స్ వస్తే ఏ హీరోతో డేటింగ్ చేస్తారు అని అడిగాడు. దానికి అనసూయ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.ఒకవేళ నాకు పెళ్లి కాకపోయి ఉంటే నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో డేటింగ్ చేసేదాన్ని అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇక అనసూయ ఆన్సర్ కి చాలా మంది నెటిజన్లు చిట్టిబాబుపై మోజు పడుతున్న రంగమ్మత్త అంటూ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: