
మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్ప సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డుకు కూడా లేఖలు రాశారని తెలిపారు. అలాంటి వారిని చూస్తే తనకు నవ్వొస్తుందని ఎందుకంటే వారికి అసలు చరిత్ర తెలియకపోవచ్చు.. తాము చాలా రీసెర్చ్ చేసి మరి ఎంతోమంది అర్చకులకు ఈ సినిమా చూపించిన తర్వాతే ఈ సినిమాని ఫైనలైజ్ చేసామని అందరూ కూడా ఒప్పుకున్నారని తెలిపారు విష్ణు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన స్టార్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలిపారు.
ముఖ్యంగా ప్రభాస్ కి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చాలామంది చిన్న స్థాయిలో ఉన్న ఉన్నవారిని పెద్దగా పట్టించుకోరు.. వారికి సహాయం కూడా చేయరు కానీ ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి కూడా ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా అడగగానే వెంటనే ఒప్పుకున్నారని ఈరోజుల్లో నా రక్తం పంచుకొని పుట్టిన వారే నా పతనాన్ని కోరుకుంటున్నారు కానీ ప్రభాస్ మాత్రం తనకు హెల్ప్ చేశాడు అందుకే అతను అంటే నాకు చాలా గౌరవం అంటూ అటు ప్రభాస్ పైన ప్రశంసలు కురిపిస్తూ తన సోదరుడైన మంచు మనోజ్ పైన ఇన్ డైరెక్టుగా కౌంటర్ వేసినట్లుగా కనిపిస్తోంది విష్ణు.
ఇక ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ ఇలా ఎంతోమంది స్టార్స్ నటించారు వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు వారి హార్డ్ వర్క్ మా సినిమా సక్సెస్ అందుకుంటుందని తెలిపారు.