టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దసరా పండుగ సమయంలో ఈ సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
 
అయితే పవన్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాకు సైతం ఇదే డేట్ ను పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మెగా నందమూరి హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఇండస్ట్రీలో సాధారణం అనే సంగతి తెలిసిందే. అయితే అటు బాలయ్య ఇటు పవన్ ఏపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉన్న సంగతి తెలిసిందే.
 
కూటమి పొత్తులో ఉన్న ఎమ్మెల్యేలైన బాలయ్య, పవన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటమే ఒక విధంగా రికార్డైతే ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే మరో రికార్డ్ అవుతుంది. అయితే బాలయ్య, పవన్ బాక్సాఫీస్ క్లాష్ పరిస్థితి వస్తే ఈ ఇద్దరు హీరోలు ముందుకెళ్తారా లేక ఈ హీరోలలో ఎవరో ఒకరు తగ్గుతారా అనే చర్చ జరుగుతుంది. పవన్, బాలయ్య రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు.
 
ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి. వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటున్న ఈ హీరోలు సరైన రోల్స్ దక్కితే బాక్సాఫీస్ దగ్గర సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ కాగా అభిమానులకు మాత్రం అఖండ2, ఓజీ సినిమాల విడుదలతో పండుగ ముందుగానే రాబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: