
ముఖ్యంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్లు తన కెరీర్ కి సపోర్ట్ ఇచ్చారని చెప్పారు. ఇక వివాహ విషయంలో తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఆలోచన అయితే లేదని కెరియర్ పరంగా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నానంటూ తెలిపారు విజయ్ దేవరకొండ. అయితే రష్మిక గురించి మాట్లాడుతూ రష్మిక మంచి అమ్మాయి ఆమెతో మరిన్ని సినిమాలు తీయాలని ఉంది.. ఆమె ఒక అద్భుతమైన నటి అంటూ తెలియజేశారు. ఇలాంటి సమయంలోనే రష్మికలో మీకు కాబోయే భార్యకు ఉన్న లక్షణాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించగా..
అందుకు విజయ్ స్పందిస్తూ రష్మిక కి మంచి మనసు ఉంది.. అంటూ తెలుపడంతో దీన్నిబట్టి చూస్తే విజయ్ ఇన్ డైరెక్ట్ గానే చెప్పేసినట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ రష్మి కానీ చేసుకోకుండా ఉండి ఉంటే ఆ విషయాన్ని క్లియర్గా విజయ్ దేవరకొండ చెప్పేవారు కదా అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అటు ఈ విషయం పైన అటు రష్మిక క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. అయితే ఇప్పటికి విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక ఎన్నో సందర్భాలలో వెళ్తూ వస్తూ ఉంటుంది. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతోంది.