- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి కాంబినేషన్ సినిమాల‌లో మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ ఒక‌టి. ఈ సంక్రాంతికి విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా సంక్రాంతికి వ‌స్తున్నాం లాంటి కామెడీ ఎంట‌ర్టైన‌ర్ తెర‌కెక్కించి ఏకంగా రు. 300 కోట్ల వ‌సూల్లు కొల్ల‌గొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు ఏకంగా చిరుతో సినిమా చేస్తుండ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు. మెగాస్టార్ కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో చిరుకు జోడీగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా కోసం నయన్ ఎప్పుడూ లేనిది ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడం తో అంద‌రూ షాక్ అవుతున్నారు.


అస‌లు న‌య‌న్ ను అనిల్ రావిపూడి ప్ర‌మోష‌న్ల కోసం ఎలా ఒప్పించాడ్రా బాబు .. అనిల్ మామూలోడు కాద‌నే అంటున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే చిరు సినిమా కోసం నయన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీనితో ఈమె ఏకంగా 18 కోట్ల మేర రెమ్యునరేషన్ ని అందుకుంటున్నట్టు టాక్ ? ఇది సౌత్ హీరోయిన్ల లోనే చాలా ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అని చెపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుండ‌గా ... వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే లా మేక‌ర్స్ ప్లాన్ చేస్తు న్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: