
ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. హీరో సుమంత్ సినిమాలను ఎంచుకునే పద్ధతి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈయన చాలా తక్కువ సినిమాలతో తెరపైకి వచ్చినప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఈయన నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందులో మిస్ కాకుండా చూడాల్సిన 7 ఫేమస్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సుమంత్ నటించిన సత్యం సినిమా టీవీలో వస్తుందంటే ఇప్పటికి ప్రేక్షకులు మిస్ కాకుండా చూస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జెనీలియా నటించింది. ఆ తర్వాత సుమంత్ గోదావరి సినిమాతో తెరపైకి వచ్చారు. ఈ సినిమాలో కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా అంటే నచ్చని వారుండారు. సుమంత్ హీరోగా నటించిన మధుమాసం సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటి స్నేహ, పార్వతి మెల్టన్ ముఖ్యపాత్రలో నటించారు. సుమంత్ గోల్కొండ హై స్కూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కలర్స్ స్వాతి ముఖ్యపాత్రలో కనిపించింది. క్లాస్ మెట్ సినిమాతో సుమంత్ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఈ సినిమాలో ప్రస్తుత స్టార్ హీరో శర్వానంద్, నటి సదా, సునీల్ కీలక పాత్రలను పోషించారు. కొంత కాలం గ్యాప్ తర్వాత గౌతం తిన్ననూరి దర్శకత్వంలో మళ్లీ రావా సినిమాతో సుమంత్ ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించారు. ఇక ఇప్పుడు అనగనగా సినిమాతో మరోసారి సుమంత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.