
ఈ చిత్ర ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది . ట్రైలర్ విడుదల ఈ మిశ్రమ స్పందన అందుకుంటుంది . ఎంతమంది ఈ సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ మంది ఈ సినిమాలో కమల్ హాసన్ - అభిరామి లిప్ లాక్ చేసిన సీన్ పై మండిపడుతున్నారు . ఈ చిత్రంలో శింబు-త్రిష-ఐశ్వర్య లక్ష్మి- అభిరామి ఇతరులు కీలకపాత్రలో నటించి మెప్పించబోతున్నారు. కాగా ఈ ధగ్ లైఫ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో కమల్ హాసన్ అదే విధంగా అభిరామి ల లిప్ కిస్ సీన్ పై ఫుల్ ఫైర్ అవుతున్నారు జనాలు .
అభిరామి వయసు 41 కమలహాసన్ వయసు 70 అంటే దాదాపు తండ్రి వయసున్న హీరోతో ఎలా లిప్ కిస్ సీన్ లో నటించింది అని దుమ్మెత్తి పోస్తున్నారు జనాలు . అయితే అభిరామికి టాలీవుడ్ ఇండస్ట్రీతో ఉన్న సంబంధం గురించి కూడా చర్చించుకుంటున్నారు . నిజానికి అభిరామి కేరళకు చెందిన అమ్మాయి . తెలుగులో "చెప్పవే చిరుగాలి" అనే సినిమాలో నటించి తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది . ఈ సినిమాలో చాలా పద్ధతిగా నటించింది. ఆ తర్వాత అక్బర్ ఆంటోనీ.. మహారాజా.. సరిపోదా శనివారం .. భలే ఉన్నాడే ..వెట్టయన్ వంటి సినిమాలలో నటించి ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. మళ్లీ 2013లో ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత కమలహాసన్ నటించిన విశ్వరూపం , విశ్వరూపం 2 సినిమాలలో హీరోయిన్ పూజ కుమార్ కు తమిళ్ వర్షన్ లో డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు అదే కమలహాసన్ సరసన అభిరామి నటించే ఛాన్స్ కొట్టింది . నటనే కాదు బోల్డ్ రొమాన్స్ కూడా చేసింది . ఒకే ఒక్క లిప్ కిస్ సీన్ తో ఇండస్ట్రీని మడత పెట్టేసింది . చాలామంది అభిరామిని మెచ్చుకుంటుంటే మరి కొంతమంది బూతులు తిడుతున్నారు..!