
డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు .. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా .. గొప్ప వారియర్ రోల్ సినిమా కూడా ఇదే .. భారీ అంచనాలు ఈ సినిమా పై నెలకొన్నాయి .. అలాగే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ఇప్పటికే మంచి సక్సెస్ సాధించి గా ఇప్పుడు తాజా గా మూడో పాట అందులోనూ పవర్ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేస్తుండటం ఇప్పుడు మరో సెన్సేషన్ గా మారింది .
అలాగే ఈ పాట కచ్చితంగా సినిమాకి మంచి బూస్ట్ గా నిలవబోతుందని కూడా చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది .. ప్రధానంగా కీరవాణి నుంచి వచ్చిన కొన్ని బీట్స్ కూడా సోషల్ మీడియా లో ఫాన్స్ ని ఎంతగానో యక్సిట్ చేశాయి .. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఏకంగా 50 సార్లు ఈ సాంగ్ విన్నానని చెప్పడం కూడా అందరి ఈ పాటపై ఇంట్రెస్ట్ ను పెంచింది .. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు ఈ సాంగ్ మీదే ఉన్నాయ ని కూడా చెప్పాలి .. అలాగే అవైటెడ్ సాంగ్ ఈ ఉదయం 11 గంటల 55 నిమిషా లకి రిలీజ్ చేయనున్నారు .. అలాగే ఈ సినిమా ని వచ్చేనెల జూన్ 12న ఎంతో గ్రాండ్గా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు .. రాజకీయాల్లో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ తన వీరమల్లు సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9705876414 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు