
పూజా హెగ్డే "రెట్రో" సినిమా హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు . కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. పూజ హెగ్డే లుక్స్ పై కూడా దారుణమైన కామెంట్స్ వినిపించాయి . దీంతో పూజా హెగ్డే ఖాతాలో ఉన్న రెండు మూడు సినిమాలు కూడా వేరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్లిపోయాయి. అయితే ప్రెసెంట్ పూజా హెగ్డే.. బుచ్చిబాబు సనా - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న "పెద్ది" సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది . ఆల్ రెడి రంగ్స్ధలం సినిమాలో "జిల్ జిల్ జిగేలు రాని" సాంగ్ వీళ్ల కాంబోలో వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.
అయితే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఒక బోల్డ్ వెబ్ సిరీస్ కూడా చేయబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది . అయితే ఇది హీరోయిన్గా కాదు వేరే క్యారెక్టర్ అంటూ తెలుస్తుంది. సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమ్ లేని హీరోయిన్స్ ని పట్టించుకోరు . ఒకవేళ పట్టించుకున్న అది వేరే క్యారెక్టర్ కోసం మాత్రమే అయ్యి ఉంటుంది. లీడ్ క్యారెక్టర్ అస్సలు ఉండదు. పూజ హెగ్డే పరిస్థితి ప్రెసెంట్ బాగోలేదు . ఈ కారణంగానే ఆమె బోల్డ్ పాత్ర చేయడానికి ఓకే చేసిందట. అంతేకాదు పూజ హెగ్డే డబ్బు కోసమే ఇలా నటించాల్సిన అవసరం ఏముంది..? అంటున్నారు ఆమె ఫ్యాన్స్. డబ్బు కోసం ఏమైనా చేస్తావా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు. పూజ హెగ్డే పరిస్థితి దారుణాతి దారుణంగా మారిపోయింది . సొంత ఫ్యాన్స్ కూడా బూతులు తిట్టే స్థాయికి దిగజారిపోయింది పూజా హెగ్డే..!