టాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ పిన్ గా దిల్ రాజుకు పేరుంది. దిల్ రాజుకు ఎదురెళ్లే సాహసం ఎవరూ చేయరు. కొన్నేళ్ల క్రితం వరకు నైజాం ఏరియాలో దిల్ రాజుకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు దిల్ రాజుకు గట్టి షాక్ ఇవ్వాలని భావించినా ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారడంతో కొంతమేర లెక్కలు మారాయి. మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
 
అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వ్యవహారంలో ఎక్కువమంది దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ మద్దతు వల్లే వివాదం చినికి చినికి గాలివానలా మారిందని నమ్ముతున్నారు. దిల్ రాజు కావాలని చేయకపోయినా ఈ వివాదం విషయంలో ఆయన పాత్ర ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అయితే దిల్ రాజుతో కలిసి ఉంటే తమకు కూడా నష్టమని భావించిన గిల్డ్ లోని మిగతా నిర్మాతలు దిల్ రాజుకు భారీ షాకిచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. గిల్డ్ లో దిల్ రాజు ఒంటరి కావడం పక్కా అని యాక్టివ్ గా ఉన్న ఇతర నిర్మాతలు అంతా మరోవైపు ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ రెంట్ల వ్యవహారం చర్చకు రావడం ఇదే తొలిసారి కాదు.
 
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్న సమయంలో సైతం నైజాంలో రెంట్లు పెంచాలనే వాదన జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలే టార్గెట్ గా వేర్వేరు సందర్భాల్లో కుట్రలు జరుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంలో సైతం నిజానిజాలు తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పొలిటికల్, సినీ లెక్కలు పూర్తిస్థాయిలో మారిపోయాయని చెప్పవచ్చు. పవన్, దిల్ రాజు మధ్య కూడా గ్యాప్ పెరిగినట్టేనని ఇండస్ట్రీ వర్గాల టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: