హీరో శ్రీకాంత్ కి సంబంధించి తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన శ్రీకాళహస్తిలో రహస్య పూజలు చేయించుకోవడంతో ఈ వీడియోలు, ఫోటోలు కాస్త వెలుగులోకి రావడంతో అర్చకుడు పై భారీ వేటు పడింది. మరి ఇంతకీ శ్రీకాంత్ రహస్య పూజలు చేసుకోవడం వెనుక ఉన్న కారణమేంటి.. అర్చకుడిపై వేటు ఎందుకు పడింది అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది హీరోలు స్టార్డం కోసం ఏవేవో పూజలు చేయించుకుంటూ ఉంటారు. మరి కొంత మందేమో దిష్టి, దోషం పోయి ఇండస్ట్రీలో రాణించడం కోసం కూడా కొన్ని రకాల పద్ధతులు నమ్మి పూజలు చేయించుకుంటారు. అయితే తాజాగా శ్రీకాంత్ నవగ్రహ పూజలు చేయించుకున్నారు. దీంతో శ్రీకాంత్ చేసిన పనికి పూజారిపై వేడుపడింది. అసలు విషయం ఏమిటంటే.. ఈ నెల 29న శ్రీకాంత్ తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తి వెళ్లారు. 

అక్కడ కుటుంబంతో కలిసి రాఘవేంద్ర స్వామి మఠం లో నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. అయితే ఇదంతా ఓకే కానీ ముక్కంటి గుడిలో పనిచేసే కొంత మంది అర్చకులు శ్రీకాంత్ కి ప్రైవేట్ గా నవగ్రహ శాంతి పూజలు చేయించారు. ఇందులో కొంతమంది వేద పండితులు కూడా పాల్గొన్నారు.అయితే శ్రీకాంత్ చేసిన నవగ్రహ శాంతి పూజలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటికి వచ్చాయి.ఆ ఫొటోలో శ్రీకాళహస్తి ఆలయంలో పనిచేసే పూజారి కూడా ఉండడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే శ్రీకాళహస్తి ఆలయంలో పనిచేసే అర్చకులు ఎవరు కూడా ఇతర దేవాలయాల్లో పాల్గొనకూడదు పూజలు చేయకూడదు అనే నిబంధన ఉంది.
అయితే ఈ నిబంధనను ఉల్లంఘించి శ్రీకాళహస్తి ఆలయంలో ఉండే అర్చకుడు శ్రీకాంత్ కి ప్రైవేట్ గా నవగ్రహ శాంతి పూజలు చేయడంతో శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి స్పందించారు. శ్రీకాళహస్తి దేవస్థాన నియమాలను ఉల్లంఘించి ఆలయ ప్రతిష్ట దెబ్బతీశారు అనే కారణంతో అర్చకుడికి మెమో ఇచ్చి సస్పెండ్ చేశారు. శ్రీకాంత్ కి చేసిన ప్రైవేటు పూజ విషయంలో ఆ అర్చకుడు పై భారీ వేటుపడడంతో ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి వచ్చింది . ఇక ఈ అర్చకుడిని విధుల నుండి తొలగించడంతో ఈ విషయం తెలుసుకొని ఎవరు కూడా ఇలాంటి పని మరొకసారి చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఆలయ ఈవో బాపినీడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: