సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావాలి అంటే ఎంత కష్టపడాలో ఎన్ని సాక్రిఫైజ్ చేయాలో ..ఎన్ని మాటలు పడాలో ప్రతి ఒక్కరికి తెలిసిందే.  అలా పడిన ప్రతి ఒక్కరికి కూడా సినిమా అవకాశాలు వచ్చేస్తాయని ..స్టార్ అయిపోతారు అన్న నమ్మకాలు లేవు.  ఎంతోమంది తమ జీవితాన్ని దార పోసిన జీవితంలో సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు . ఫైనల్లీ తమ ఊరికి వెళ్తున్న కొట్టు పెట్టుకొని బతికేస్తున్న సిచువేషన్ చూస్తున్నాము.  అయితే దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదు అన్నట్లు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్న కూడా ఒక స్టార్ డైరెక్టర్ తీసుకుంటున్న నిర్ణయం ఇప్పుడు ఆయన కెరియర్ కు బిగ్ మైనస్ గా మారిపోయింది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ వర్మ.


ప్రశాంత్ వర్మ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా నెగిటివ్గా ట్రెండ్ అవుతుందో ట్రోలింగ్ అవుతుందో మనం చూస్తున్నాం.  ఒకప్పుడు ప్రశాంత్ వర్మ అంటే పొగిడేసే వారు జనాభా.  మరి ముఖ్యంగా హనుమన్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు.  మహేష్ బాబు "గుంటూరు కారం" సినిమాకి కాంపిటీటివ్గా వచ్చిన హనుమాన్ సినిమా సూపర్ సూపర్ హిట్ అయింది. మహేష్ బాబు సినిమాని తొక్కేసింది . దీంతో ఒక్కసారిగా ప్రశాంత్ వర్మ పేరు బాగా హాట్ టాపిక్గా వైరల్ అయ్యింది.  అంతేనా తర్వాత బ్యాక్ టు బ్యాక్ స్టార్స్  అవకాశాలు ఇవ్వడంతో ఆయన రేంజ్ వేరే లెవెల్ కి మారిపోయింది .



మరీ ముఖ్యంగా బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతలు ఆయన ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టడం హైలైట్ గా మారింది . అయితే ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్.. ఆయన కెరియర్ టోటల్ స్పాయిల్ చేసేసాయి. అంతేకాదు మోక్షజ్ఞ సినిమా గురించి పట్టించుకోకుండా మరొక హీరో సినిమా కోసం ఎక్కువగా పాకులాడుతున్నాడు అన్న వార్తలు వినిపించాయి.  అంతేకాదు మోక్షజ్ఞ సినిమా ఇప్పుడు ప్రశాంత్ వర్మ చేతుల్లో లేదు అంటూ కూడా టాక్ వినిపిస్తుంది . అంతేనా ప్రభాస్ తో ఒక సినిమా కమిట్ అయినట్టు వార్తలు వినిపించాయి . ఈ సినిమా కూడా తూతూ మంత్రంగానే ఉన్నట్లు టాక్ .



అవ్వచ్చు లేకపోతే క్యాన్సిల్ అవ్వచ్చు అంటున్నారు సినీ వర్గాలు . అయితే ప్రశాంత్ నీల్  సడన్గా ఇంత నెగిటివిటీ రావడానికి కారణమైన హెడ్ వెయిట్ అంటూ మాట్లాడుతున్నారు జనాలు . హనుమాన్ సినిమా తర్వాత ఆయనకు బాగా హెడ్ వెయిట్ పెరిగిపోయింది అని ఇదే క్రమంలో ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్ కి స్టార్ట్ చేసి కొన్ని సినిమాలను నిర్మించాలని ఉద్దేశంతో కూడా ఉన్నాడు అని .. ఆ కారణంగా రెండు పనుల్లో బిజీ బిజీగా ఉండడంతో ఏ ఒక్క పనికి న్యాయం చేయలేక ఇలా లైఫ్ ని స్పాయిల్ చేసేసుకుంటున్నాడు అని మాట్లాడుకుంటున్నారు . కొత్త సినిమాలను డైరెక్షన్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది అలాంటప్పుడు పూర్తిగా కాన్సన్ట్రేషన్ దానిపైన పెట్టాలి .. ఇలా రెండు పనులు ఒకేసారి చేస్తే కెరియర్ అనేది డైలమాలో పడిపోతుంది . అప్పుడు సినీ లైఫ్ ఆయనకు అనుకున్నంత స్థాయిలో రిచ్ కాలేకపోవచ్చు ప్రశాంత్ వర్మ ఇకనైనా ఈ విషయాన్ని ఆలోచించి సినిమాలను డైరెక్ట్ చేసి ఆ తర్వాత ప్రొడక్షన్ హౌస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అంటున్నారు ఆయన స్నేహితులు. కొంతమంది మాత్రం   చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అంటూ ప్రశాంత్ వర్మ ని ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: