
ఇక కూలి సినిమాను లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తుండగా .. ఇప్పుడు జైలర్ 2 సినిమాలో చాలామంది స్టార్స్ నటించబోతున్నట్టు తెలుస్తుంది .. ఇప్పటికే ఈ సినిమాలో నటసింహం బాలకృష్ణ కూడా ఒక పాత్రలో నటించబోతున్నారు .. అలాగే జైలర్ 2 సినిమాలో బాలకృష్ణ పాత్ర 20 నిమిషాలు ఉంటుందని టాక్ కూడా బయటకు వచ్చింది .. అయితే ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ కూడా నటించబోతుందని టాక్ వినిపిస్తుంది .. జైలర్ మొదటి భాగంలో రజినీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించారు .
నరసింహ మూవీ తర్వాత రజనీకాంత్ , రమ్యకృష్ణ కలిసి జైలర్ సినిమాలో నటించారు. ఇప్పుడు జైలర్ 2 మూవీలో విద్యాబాలన్ హీరోయిన్గా నటించబోతుందని టాక్ బయటికి వచ్చింది .. ఇక త్వరలోనే దీనిపై క్లారిటీ కూడా రానుంది .. విద్యాబాలన్ ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు , మహా నాయకుడు సినిమాలో నటించింది .. అంతకు ముందు ఈమె నటించిన డర్టీ పిక్చర్ సినిమా తెలుగులో కూడా విడుదలైంది .. అలాగే తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం అందుకుంది .. ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో విద్యాబాలన్ నటించబోతుందని టాక్ వినిపిస్తుంది .. ఇక త్వరలోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ రానుంది ..