
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియ సినిమాలలో మంచు హీరో మంచు విష్ణు నుంచి వస్తున్న బిగ్గెస్ట్ మూవీ కన్నప్ప కూడా ఒకటి .. ఈ సినిమా విష్ణు కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో డ్రీమ్ ప్రాజెక్టుగా కూడా పిలవబడుతుంది .. కాగా మంచి అంచనాలు నెలకొన్న ఈ సినిమా లో పాన్ ఇండియా స్థాయి లో అనేకమంది బడా స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు .. ఇక వారి లో పాన్ ఇండియ హీరో ప్రభాస్ కూడా ఒకరు .. ఇక ఈ సినిమాలో ప్రభస్ సుమారు 30 నిమిషాల వరకు కనిపించబోతున్నట్టు టాక్ కూడా వినిపిస్తుంది ..
అయితే ఈ సినిమా కోసం ఇప్పటికే సాలిడ్ ప్రమోషన్స్ ని మేకర్స్ అండ్ టీం చేస్తుండ గా .. మంచు విష్ణు కూడా అంతే ఎగ్రిసియో గా ప్రమోషన్లు చేసుకుంటూ వెళ్తున్నాడు .. అయితే ఇప్పుడు ఈ ప్రమోషన్స్ లో తన సినిమా రిలీజ్ పై అసలైన క్లారిటీ ఇచ్చేసాడు .. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 27 నే వస్తుంది అని కన్ఫామ్ కూడా చేశారు .. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ భారీ ఈవెంట్స్ ని కూడా తాము ప్లాన్ చేసామ ని కూడా క్లారిటీ ఇచ్చేశారు .. సో ఈ పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమా కచ్చితంగా జూన్ 27 న ప్రేక్షకుల కు భారీ ట్రీట్ ఇవ్వనంది అని చెప్పకనే చెప్పేసారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు