
టాలీవుడ్‌కు అత్యంత కీలకమైన సమ్మర్ సీజన్ ముగిసింది. మార్చి - ఏప్రిల్ - మే నెలలో అటు ఇటుగా 75 సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్టార్ హీరోల సినిమాలు రాలేదు. విశ్వంభర - రాజాసాబ్ రాలేదు .. దీంతో ఏ ఏడాది కూడా సమర్ బాక్సాఫీస్ వెలవెల పోయింది. మార్చి నెలలో 29 సినిమాలు రిలీజ్ అయితే. ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. ఉన్నంతలో కోర్ట్ - మ్యాడ్ స్క్వేర్ బాక్సాఫీస్ ను ఆదుకున్నాయి. రాబిన్ హుడ్ అట్టర్ ప్లాప్ అయ్యింది. దిల్ రూబా విమర్శల పాలయ్యింది. ఏప్రిల్ నెలలో కూడా పాతిక సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఏప్రిల్ నెలలో ఒక హిట్ కూడా లేదు. జాక్ - ఓదెల 2 - అర్జున్ సన్నాఫ్ వైజయంతీ - సారంగపాణి జాతకం సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. జాక్ అయితే మరీ దారుణం.
హిట్ 3 సినిమాతో మే నెల బాక్స్ ఆఫీస్ గ్రాండ్ గా ఓపెన్ అయింది. ఆ సినిమా ముచ్చట నాలుగు రోజులకే పరిమితమైంది. వసూళ్లు రు. 100 కోట్లు దాటినట్టు పోస్టర్ వేసుకున్న రిజల్ట్ మాత్రం యావరేజ్. చాలా ఏరియాలలో కూడా ఈ సినిమా నష్టాలు తెచ్చి పెట్టింది. ఇదే నెలలో వచ్చిన శ్రీ విష్ణు సింగిల్ సినిమా సక్సెస్ అయ్యింది. శుభం - భైరవం - షష్టిపూర్తి లాంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. అలా ఒక బ్లాక్ బస్టర్ లేకుండానే ఈ ఏడాది సమ్మర్ ముగిసింది. కీలకమైన సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరు చూపు దసరా - క్రిస్మస్ మీదే ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు