
సిద్దు జొన్నలగడ్డ, టాలీవుడ్‌లోని యువ కథానాయకుడు, తన నటనతోనే కాకుండా మంచి మనసుతో కూడా అందరి గుండెల్లో చోటు సంపాదించాడు. ఇటీవల విడుదలైన జాక్ సినిమా ఆశించిన ఫలితాలను రాబట్టకపోవడంతో, నిర్మాతలకు జరిగిన నష్టంలో తన వంతు బాధ్యతగా సిద్దు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన పారితోషికం నుండి సగం, అంటే 4 కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగి ఇచ్చి, తన పెద్ద మనసును చాటుకున్నాడు.
ఈ చర్య సినీ పరిశ్రమలో అరుదైన, ఆదర్శనీయమైన ఉదాహరణగా నిలిచింది. సిద్దు ఈ విధమైన బాధ్యతాయుతమైన, నీతిగల నిర్ణయంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు అందరూ ఆశ్చర్యపోయి, అతని మంచితనాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో సిద్దు గురించి ప్రశంసలు కురుస్తున్నాయి. సిద్ధు ను టాలీవుడ్ లో మిగిలిన హీరో లు అందరూ ఆదర్శం గా తీసుకోవాలని కూడా కామెంట్లు కురిపిస్తున్నారు.
"సిద్దు లాంటి నటులు నిర్మాతలకు అండగా నిలిస్తే, సినీ పరిశ్రమ మరింత విజయవంతమవుతుంది," అని అభిమానులు, విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చర్య సిద్దు జొన్నలగడ్డను కేవలం ఒక నటుడిగా కాక, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, సినీ పరిశ్రమకు ఆదర్శంగా నిలిపింది. ఇక సిద్దు తదుపరి చిత్రం తెలుసు కద అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొనగా, సిద్దు మరోసారి తన నటనతో, చలనచిత్ర ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు