- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ముగిసింది. రిలీజ్ కు రెడీ అవుతుంది. అటు ఓజీ కూడా రిలీజ్ అవుతుంది. ఇక ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమా షూటింగ్ లోను పవన్ బిజీ అయ్యాడు. పవన్ తన కెరీర్ లో 20 ఏళ్ల తర్వాత ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేస్తున్నాడు. పవన్ సినిమా కెరీర్లు ఒకే ఏడాదిలో రెండు సినిమాలు వచ్చిన సందర్భం చాలా అరుదు. ఒక్క 2006 సంవత్సరంలో మాత్రమే పవన్ ఏడు నెలల గ్యాప్ లో బంగారం - అన్నవరం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాల రిజ‌ల్ట్ విషయాన్నీ పక్కన పెడితే . . . మళ్లీ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇలాంటి సీన్ రిపీట్ అవుతుంది.


2025లో కేవలం మూడు నెలల గ్యాప్ లోనే పవన్ హరిహర వీరమల్లు - ఓజీ సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. రిలీజ్ డేట్ కాస్త అటు ఇటు అయినా .. ఈ రెండు సినిమాలు రిలీజ్ కావటం ఖాయం. దీంతో 20 ఏళ్ల తర్వాత పవన్ రిపీట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.. ఏదేమైనా ప‌వ‌న్ అభిమానులు .. తెలుగు సినీ అభిమానులు మాత్రం మూడు నెల‌ల్లో రెండు ప‌వ‌న్ సినిమాలు ఎంజాయ్ చేసేందుకు ఆస‌క్తితో ఉన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: