
టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ తన లైనఫ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తన బాలీవుడ్ డబ్బింగ్ మూవీ వార్ 2 సినిమాను పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ రిలీస్ కు రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో ? అందరికీ తెలిసిందే. ఇక్కడ తమిళ దర్శకుడు నెల్సన్ తో సినిమా చేయబోతున్నాడు అనే టాక్. ఒకేసారి మూడు సినిమాలు కంటే కూడా త్రివిక్రంతో ఎన్టీఆర్ చేసే సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సూపర్ డూపర్ హిట్ అయింది. త్వరలోనే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మైథాలజికల్ కథతో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి నిర్మాత నాగ వంశీ లీకులు ఇచ్చారు.
ఈ సినిమా కుమారస్వామి కథను మనకు చూపించబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అసలు ప్రజలకు తెలియని కుమారు స్వామి కథను త్రివిక్రమ్ ఎంత పవర్ఫుల్గా చూపిస్తాడా ? అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా కుమారస్వామి చరిత్రను గానే వినాయకుడితో మూడు లోకాల ప్రదక్షణలో పోటీ పడటం.. శివ పార్వతుల చుట్టూ వినాయకుడు ప్రదక్షిణ చేసి విజయం సాధిస్తే ... కుమారస్వామి తన నెమలి వాహనంతో భూలోకం మొత్తం చుట్టి వస్తాడు. ఇంతవరకే కుమారస్వామి గురించి అందరికీ తెలిసిన కథ.
ఇప్పుడు కుమారస్వామికి సంబంధించి మరిన్ని కోణాలు మనకు చూపించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు. దీంతో సోషల్ మీడియాలో కుమారస్వామి చరిత్ర ఏమిటా ? అని అభిమానులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ప్రాజెక్టు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు