దాదాపు రెండు దశాబ్దాల నుంచి సినీ పరిశ్రమలో హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో కాజల్ అగర్వాల్ ఒకటి. తెలుగు చిత్రాలతో పాపులర్ అయిన కాజల్.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కూడా స్టార్ హోదాను సంపాదించుకుంది. అడపా దడపా హిందీ చిత్రాల్లో నటించి అక్కడ సైతం కొంత గుర్తింపు తెచ్చుకుంది. అయితే వివాహం అనంతరం కాజల్ కెరీర్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత ఆమెకు మునుపటి మాదిరి అవకాశాలు రావడం లేదని చెప్పాలి.


ఈమధ్య కాలంలో చేసిన ఒకటో రెండో చిత్రాలు కూడా పరాజయం పాలవడంతో కాజల్ కెరీర్  డేంజర్ జోన్ లో పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ `ఇండియన్ 3` చిత్రంలో నటిస్తోంది. `ఇండియన్ 2` మూవీ డిజాస్టర్ కావడం వల్ల ఇండియన్ 3పై ఎటువంటి అంచనాలు లేవు. మరోవైపు మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన `క‌న్నప్ప`లో కాజ‌ల్ పార్వతీదేవిగా నటించింది. జూన్ 27న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.


ఇదిలా ఉండగా.. కాజల్‌కు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స‌రైన అవ‌కాశాలు లేక‌పోవ‌డం వ‌ల్ల గ‌త కొంత కాలం నుంచి కాజ‌ల్ బ్రాండ్ ప్ర‌మోష‌న్స్‌కే ప‌రిమితం అయింది. క‌నీసం సీనియ‌ర్ స్టార్స్ కూడా ఆమె వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదు. ఈ నేప‌థ్యంలోనే కాజ‌ల్ కొత్త రూట్‌లో వెళ్లేందుకు రెడీ అయిందట‌. మ‌ళ్లీ ఫ్రైమ్ టైమ్‌లోకి వ‌చ్చేందుకు డైరెక్ట‌ర్‌గా మార‌బోతోంద‌ట‌. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో క‌థానాయ‌కిగా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో కూడిన ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ను తెర‌కెక్కించాల‌ని కాజ‌ల్ భావిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు వాస్త‌వం ఉంది అన్న‌ది తెలియ‌దు కానీ.. ఒక‌వేళ కాజ‌ల్ నిజంగా మెగా ఫోన్ ప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకుంటే మాత్రం బిగ్ రిస్క్ చేస్తున్న‌ట్లే అవుతుంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: