తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లల బాగు కోసమే ఆలోచన చేస్తారు.కానీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాత్రం నా తల్లిదండ్రుల  కారణంగా నేను నా కెరియర్ ని ఎంతగానో నష్టపోయాను.. నా జీవితం నాశనం అయ్యింది అని చెబుతోంది. మరి అంత పెద్ద సెలబ్రిటీ హోదాలో ఉన్న మృణాల్ ఠాగూర్ తల్లిదండ్రుల వల్ల తన జీవితం నాశనం అయిందని ఎందుకు మాట్లాడింది.. తల్లిదండ్రులు ఆమెకు చేసిన అన్యాయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే అన్నింటికీ సిద్ధమై ఉండాలి. ఎలాంటి సీన్లు అయినా నటించగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించను, లిప్ లాక్ సీన్స్ చేయను అంటే కుదరదు. ఇలాంటి సీన్స్ చేసే వారిని సినిమాల్లో తీసుకుంటారు. అయితే ఒక నటిగా అన్ని చేయగలిగితేనే ఇండస్ట్రీలోకి హీరొయిన్గా రావాలి అంటారు. 

అయితే మృణాల్ ఠాగూర్ కూడా మొదట్లో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో చాలా పెద్ద పెద్ద అవకాశాలను పోగొట్టుకుందట. అది కూడా తన తల్లిదండ్రుల కారణంగా.. మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె తల్లిదండ్రులు ఇంటిమేట్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలలో చేయకూడదు అని కండిషన్ పెట్టారట.వాళ్ళ కండిషన్ కారణంగా మృణాల్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందట. ముఖ్యంగా  మృణాల్ ఠాగూర్ ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించలేదని,ముద్దు పెట్టేటప్పుడు భయపడుతుంది అని అనేవారట.కానీ ఆ తర్వాత తన జీవితంలో ఎన్ని కోల్పోయానో అని తెలుసుకున్న మృణాల్ ఠాగూర్ తన పేరెంట్స్ ని కూర్చోబెట్టి మరీ మాట్లాడి నటిగా అన్ని పాత్రలు చేయగలిగితేనే పరిపూర్ణత వస్తుంది. అలాగే సినిమాల్లో ఇది కూడా ఒక భాగం.

అలాంటి భాగాన్ని నేను మిస్ చేసుకోవాలి అనుకోవడం లేదు. అలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పిందట. ఇక కూతురి మాటలతో పేరెంట్స్ కూడా కన్విన్స్ అయ్యి అప్పటినుండి రొమాంటిక్ సీన్స్ ముద్దు సన్నివేశాలు ఉన్న సినిమాలకు కూడా ఓకే చెప్పారట. అయితే అన్నీ అలాంటి సినిమాలే ఎంచుకుంటానని కాదు, కానీ నటిగా అలాంటి సినిమాలు కూడా చేయాలి అని నిర్ణయించుకున్నాను అంటూ మృణాల్ ఠాగూర్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పింది. ఇక మృణాల్ ఠాగూర్ సినిమాల విషయానికొస్తే..ఆమె తెలుగులో ఫ్యామిలీ స్టార్ తో కనిపించింది.ప్రస్తుతం అడివి శేష్ తో డెకాయిట్ లో చేస్తుంది. ఇక బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాలో చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: