యంగ్ సెన్సేషన్ శ్రీలీల బర్త్ డే నేడు. ఈ సందర్భంగా శ్రీలీల ఫ్యాన్స్ కు `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ టీమ్ క్రేజీ ట్రీట్ ఇచ్చింది. హరీష్ శంకర్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితమే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌పై ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.


మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సాక్షి వైద్య మరో హీరోయిన్ గా అల్లరించబోతోంది. అయితే నేడు శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫ్యాన్స్ ను ఖుషి చేసేందుకు సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.
`సెట్స్ లో ఎల్లప్పుడూ ఆనందాన్ని పంచే శ్రీలీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి` అంటూ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఉస్తాద్ చిత్ర‌బృందం తరఫున పోస్ట్ పెట్టారు. ఇక తాజాగా విడుద‌ల చేసిన పోస్టర్ విష‌యానికి వ‌స్తే.. కాఫీ కప్పు పట్టుకొని ఓరగా చూస్తూ శ్రీలీల సూపర్ క్యూట్ గా కనిపిస్తోంది. ఆమె లుక్ ఫాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. బ‌ర్త్‌డే పోస్ట‌ర్ అదిరింద‌ని అంటున్నారు. కాగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో శ్రీ‌లీల తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ తో పాటు శ్రీ‌లీల కూడా షూటింగ్ లో పాల్గొంటోంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ బ‌హుశా వ‌చ్చే ఏడాది ఆరంభంలో విడుద‌ల కావొచ్చ‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: