తెలుగు సినీ పరిశ్రమలో నటుడి గా తన కంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు . ఈయన కెరియర్ ప్రారంభంలో చా లా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు . ఈయన మొదటిగా పెళ్లి చూపులు సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నుండి ఈయన ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి చాలా విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ నిర్మాత ఇప్పటికే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. 

ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన థియేటర్ హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మి వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క కర్ణాటక థియేటర్ హక్కులను అమ్మివేసింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క కర్ణాటక ధియేటర్ హక్కులను బెంగళూరు కుమార్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd