కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ధనుష్ , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జునమూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని జూన్ 20 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ , వేదికను ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు జే ఆర్ సి కన్వెన్షన్ , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ లో ధనుష్ , నాగార్జున నటించడంతో ఈ మూవీ పై అటు తమిళ్ ఇటు తెలుగు రాష్ట్రాలలో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: