తమిళ నటుడు సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో కోలీవుడ్ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే సూర్య నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

దానితో సూర్య నటించిన దాదాపు ప్రతి సినిమాను కూడా తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈయన నటించిన సినిమాలను తెలుగులో రీ రిలీజ్ కూడా చేస్తున్నారు. కొంత కాలం క్రితం సూర్య హీరోగా రూపొందిన సూర్య స్తన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేయగా ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే సూర్య నటించిన మరో సూపర్ హిట్ మూవీ కూడా తెలుగులో రీ రిలీజ్ కావడానికి రెడీ అయింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 

కొన్ని సంవత్సరాల క్రితం సూర్య "వీడొక్కడే" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించగా ... కె వి ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: