ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ సిమ్రాన్.. ప్రస్తుతం సహాయక నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సిమ్రాన్ `టూరిస్ట్ ఫ్యామిలీ` మూవీతో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. ఈ చిత్రంలో తమిళ నటుడు శశి కుమార్, సిమ్రాన్ జంటగా నటించారు. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ భారీ విజయాన్ని నమోదు చేసింది. రాజమౌళి, రజనీకాంత్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.


ప్రస్తుతం సిమ్రాన్ తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇక సిమ్రాన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2003లోనే ఈమె తన చిన్ననాటి స్నేహితుడు మరియు నిర్మాత అయిన దీపక్ బగ్గాను వివాహం చేసుకుంది. చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా క‌నిపించే దీపక్ పైలెట్ కూడా. దీపక్‌, సిమ్రాన్ దంపతులకు అదీప్ మరియు ఆదిత్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇటీవల సిమ్రాన్ పెద్ద కుమారుడు అదీప్ తన స్కూలింగ్ ను కంప్లైంట్ చేశాడు.
రీసెంట్ గా జరిగిన కొడుకు గ్రాడ్యుయేషన్ వేడుకలో సిమ్రాన్ దంపతులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన సిమ్రాన్.. `మా చేతిలో చిన్న చేయి నుండి గ్రాడ్యుయేషన్ గౌనులో మా కంటే ఎత్తుగా నిలబడటం వరకు ఎదిగావు. అభినందనలు ఓడో, నువ్వు మమ్మల్ని చాలా గర్వపడేలా చేశావు` అంటూ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చారు.


అయితే ఈ పిక్స్ లో సిమ్రాన్ కొడుకుని చూసి ఏమున్నాడ్రా బాబు అంటూ సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. కొందరైతే అదీప్ ముందు హీరోలు కూడా సరిపోరని అభిప్రాయపడుతున్నారు. తల్లి బాటలోనే అదీప్‌ కూడా సినిమా రంగంలోకి రావాలని.. హీరోగా ఎదగాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. మరి అదీప్ కు సినిమాలు పై ఆసక్తి ఉందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: