మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఛలో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన గీత గోవిందం సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో ఈమె క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగిపోయింది. ఇక అప్పటి నుండి ఈమె అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని జూన్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రష్మిక పలు హీరోల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

ఒక్కో హీరో పేరు చెప్పి వారి నుండి ఏదైనా ఒక క్వాలిటీ కాపీ చేయాలి అనుకుంటే ఏ క్వాలిటీని కాపీ చేస్తారు అని యాంకర్ సుమ , రష్మికను ప్రశ్నించింది. రష్మీక అందులో భాగంగా నాగార్జున నుండి చార్మ్ ను కాపీ చేస్తాను అని చెప్పింది. ధనుష్ నుండి దర్శకత్వం , సింగింగ్ , రైటింగ్ మ్యూజిక్ , కంపోజ్ చేసే క్వాలిటీని తీసుకుంటాను అని చెప్పింది. అల్లు అర్జున్ నుండి స్వాగ్ ను తీసుకుంటాను అని చెప్పింది. ఇక విజయ్ దేవరకొండ నుండి మొత్తం కాపీ చేస్తాము అని చెప్పింది. ఇకపోతే తాజాగా రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm