
ఈసినిమాల విడుదల తేదీల మధ్య చాల గ్యాప్ ఉన్నప్పటికీ ఆవిషయాన్ని పక్కకు పెట్టి ఇప్పటి నుండే తమ సినిమాల టీజర్లను విడుదల చేస్తూ తమ మూవీల పై ఆశక్తి పెంచుకోవడానికి ఉన్న అనేక మార్గాలలో తమ మూవీ టీజర్ ప్రధానం కావడంతో ఆటీజర్ ప్రమోషన్ ను దర్శక నిర్మాతలు చాల జాగ్రత్తగా చేస్తున్నారు. దీనిలో భాగంగా లేటెస్ట్ గా విడుదలైన ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ టీజర్ కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఇలాంటి హారర్ బ్యాక్ డ్రాప్ కథలు ఇప్పటికే బాలీవుడ్ లో చాల రావడంతో బాలీవుడ్ లో ఈమూవీ టీజర్ కు స్పందన అంతంత మాత్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఈపరిస్థితులు ఇలా ఉండగా రాబోతున్న ‘దసరా’ పండుగకు విడుదల అవ్వాలని ప్రయత్నిస్తున్న ‘అఖండ 2’ మేకింగ్ షాట్స్ కు బాలీవుడ్ లో అంతంత మాత్రంగానే స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ అంచనాలతో నిర్మాణం జరుపుకున్న జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ల ‘వార్ 2’ మూవీ టీజర్ పై కూడ నెగిటివ్ కామెంట్స్ బాగా రావడంతో ఈ మూవీ నిర్మాతలు కలవర పడుతున్నట్లు టాక్. అయితే దీనికి భిన్నంగా రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ టీజర్ కు సోషల్ మీడియాలో బాగా స్పందన రావడమే కాకుండా బాలీవుడ్ మీడియాలో కూడ ఈ టీజర్ పై ప్రశంసలు వస్తున్నాయి. అయితే వీటన్నిటి కంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ మూవీ టీజర్ కు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఏర్పడటంతో ఈమూవీ నిర్మాతలు జోష్ లో ఉన్నట్లు టాక్..