శేఖర్ కమ్ముల.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు . పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీని ఏలేస్తున్న బిగ్ స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు . కానీ శేఖర్ కమ్ముల అంటే మాత్రం అందరికీ స్పెషల్ ఫీలింగ్.  ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలను ఎక్కువగా తీస్తారు అని ..జనాల నాడి పట్టుకుని సినిమాలను తెరకెక్కిస్తారు అని శేఖర్ కమ్ములకు ఎప్పటి నుంచో ఒక మంచి పేరు ఉంది . ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా "కుబేర".


ధనుష్ - నాగార్జున - రష్మిక మందన్నా కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకునింది.  కుబేర సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శేఖర్ కమ్ముల మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.  ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శేఖర్ కమ్ములకి లీడర్ 2 సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి .



ఇదే మూమెంట్లో ఆయన మాట్లాడిన మాటలు బాగా హీట్ పెంచేసాయి.  శేఖర్ కమల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా పరిచయం చేస్తూ లీడర్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది.  లీడర్ 2 రావాలి అని ఎప్పటినుంచో జనాలు వెయిటింగ్ . దానిపై హోస్ట్ ప్రశ్నించగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.." నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను . ఇందుకు సంబంధించిన కథ కూడా సిద్ధం చేశాను . కానీ ప్రెసెంట్ పరిస్థితులు మారిపోయాయి . రాజకీయ నాయకులు కాదు వాళ్లకంటే ప్రజలే తొందరగా మారిపోయారు.  అందుకే నేను సిద్ధం చేసిన కథ ఇప్పటి రాజకీయాలకు సెట్ కాకపోవచ్చు.  దీనికోసం కొత్త కథను రాయాలి.  సరేనా లైన్ దొరికితే తప్పకుండా ట్రై చేస్తాను . ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తాను "అంటూ  చెప్పుకొచ్చారు .



అయితే "జనాలే మారిపోయారు రాజకీయ నాయకుల బెటర్ " అనే విధంగా శేఖర్ కమ్ముల మాట్లాడడం ఇప్పుడు ఆయన సినిమాకి నెగిటివ్ టాక్ తీసుకొచ్చేలా మారిపోయింది . ఎందుకు శేఖర్ కమ్ముల జనాల పై అలాంటి ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నాడు..? అంటూ కొంతమంది.. మరి కొంతమంది శేఖర్ కమ్ముల పర్సనల్ మ్యాటర్స్ ని అటాక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు . మరి కొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అనగా శేఖర్ కమ్ముల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన "కుబేర" సినిమాకి నెగెటివిటీ తీసుకొచ్చే విధంగా మారిపోయింది అంటున్నారు జనాలు.  చూడాలి మరి శేఖర్ కమ్ముల ఈ నెగిటివిటీ నుంచి ఎలా బయటపడతాడో..???

మరింత సమాచారం తెలుసుకోండి: