బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న గౌతమ్ హీరోగా సోలో బాయ్ అనే మూవీ తెరకెక్కగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి మురళీ నాయక్ తల్లీదండ్రులు హాజరు కావడం జరిగింది. అయితే జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్ స్రవంతి చొక్కారావు సాయం ప్రకటించారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆమె దాతృత్వానికి ఫిదా అవుతున్నారు.

ఆపరేషన్ సింధూర్ లో మురళీ నాయక్ మృతి చెందగా  అతని తల్లీదండ్రులు  శ్రీరామ్ నాయక్, జ్యోతి బాయి దంపతులు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు.  సోలో బాయ్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు ఆమె యాంకర్ గా వ్యవహరించారు.  అతిథులుగా పాల్గొన్న మురళీ నాయక్ తల్లిదండ్రులకు ఆమె ఏకంగా లక్ష రూపాయలు విరాళంగా అందించారు.  గతంలో కూడా పలు సందర్భాల్లో తోచిన సాయం చేసి ఆమె ప్రశంసలు అందుకున్నారు.

ఆర్ధిక సాయం చేయడం గురించి ఆమె మాట్లాడుతూ  దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన బిడ్డను తిరిగి తీసుకొనిరావడం సాధ్యం కాదని  అయితే తమ వంతుగా ఆర్థిక సహాయం మాత్రం చేయగలమని ఆమె తెలిపారు.  దేశాన్ని కాపాడే బిడ్డను కన్నందుకు  వాళ్లకు కృతఙ్ఞతలు అని చెప్పుకొచ్చారు.  సోలో బాయ్ వేడుక పూర్తైన వెంటనే  డబ్బులు బదిలీ చేస్తానని ఆమె తెలిపారు. సంపాదించిన డబ్బులో కొంత మొత్తం సాయం చేసే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది.

ఈ విషయంలో స్రవంతిని  ఎంత మెచ్చుకున్నా తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  స్రవంతి మనిషే కాదని మనసు కూడా అందమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  బిగ్ బాస్  సోషల్ మీడియాలో సైతం క్రేజ్   అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.  బిగ్ బాస్ స్రవంతి పారితోషికం పరిమితంగా ఉందనే సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: