
ఈమూవీలో ధనుష్ నాగార్జునలతో సరిసమానంగా నటించిన బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ గురించి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడ చర్చించుకుంటున్నాయి. రొటీన్ విలన్ పాత్రను పోషించే జగపతిబాబు ప్రకాష్ రాజ్ రావ్ రమేష్ రొటీన్ నటనకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు జిమ్ సర్భ్ కనపరిచన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కు బాగా ఆకర్షిలవుతున్నారు.
వాస్తవానికి శేఖర్ కమ్ముల సినిమాలలో విలన్స్ ఉండరు. ‘ఆనంద్’ ‘గోదావరి’ ‘హ్యాపీ డేస్’ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘ఫిదా’ ఇలా ఏసీనిమాలో చూసినప్పటికీ సినిమా కథలలో కనిపించే రోజీన్ విలన్స్ కనిపించరు. అయితే ‘కుబేర’ విషయం దగ్గరకు వచ్చేసరికి శేఖర్ కమ్ముల తన పద్ధతి మార్చుకున్నాడు. లక్షల కోట్ల వ్యాపారం చేస్తూ ఒళ్ళంతా పొగరుతో ఉండే పారిశ్రామిక వేత్త నీరజ్ మిశ్రా క్యారెక్టర్ లో జిమ్ సర్భ్ ఒదిగిపోయాడు.
వాస్తవానికి ఇతడు బాలీవుడ్ లో పేరుమోసిన నటుడు కాదు. 2014లో విడుదలైన ‘షురురత్ కి ఇంటర్వెల్ అనే ఫ్లాప్ మూవీతో ఇతడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. 2016లో విడుదలైన నీర్జాలో ఇతడుచేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది2018లో విడుదలైన ‘పద్మావత్’ మూవీతో ఇతడికి మంచి పేరు వచ్చింది. అమెరికాలో సైకాలజీ డిగ్రీ చదివిన ఇతడికి ఈమూవీలో పాత్ర రీత్యా పెద్దగా కనిపించడానికి అతడి జుట్టుకు తెల్లరంగు వేశారు కానీ అతడి వయస్సు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే. వాస్తవానికి అతడికి తెలుగు రాకపోయినా డైలాగులను బట్టిపట్టి డబ్బింగ్ ఆర్టిస్టుకి సింక్ సమస్య రాకుండా చూపించిన ఇతని నటనా ప్రతిభకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రశంసలు లభిస్తున్నాయి..