బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ ‘కుబేర’ తో పోటీగా విడుదలైన విషయం తెలిసిందే. వాస్తవానికి జాతీయ స్థాయిలో అమీర్ ఖాన్ క్రేజ్ ముందు నాగార్జున ధనుష్ లకు చెప్పుకోతగ్గ స్థాయిలో క్రేజ్ లేదు. అయితే ఆవిషయాన్ని పక్కకు పెట్టి తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులు అమీర్ ఖాన్ సినిమా వచ్చిన విషయాన్ని కూడ పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయించి ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీలు రావడంలేడు.

బిసి సెంటర్స్ లో పలుచోట్ల అమీర్ ఖాన్ సినిమాను క్యాన్సిల్ చేసి ‘కుబేర’ సినిమాకు ఎక్సట్రా షోలను వేస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ సినిమా కథ విషయానికి వస్తే దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న తీసుకున్న కథ మరీ కొత్తది కాదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. మానసిక దివ్యాంగులకు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వాల్సి వచ్చిన గుల్షన్ అరోరా అనే వ్యక్తి చుట్టూ ఈసినిమా కథ  తిరుగుతుంది. మొదట్లో హీరోకు ఇష్టం లేకపోయినా క్రమంగా వాళ్ళతో కలిసిపోయి అందరూ చులకనగా చూసిన ఆ టీమ్ నే ఛాంపియన్స్ గా ఎలా తయారుచేశాడు అన్న సున్నితమైన కథ ఇది.

ఎమోషనల్ గా సాలిడ్ కంటెంట్ ఉన్న ఈమూవీలో అమీర్ ఖాన్ బాగా నటించాడు అన్న రివ్యూలు వచ్చాయి. అయినా తెలుగు ప్రేక్షకులు ఆవిషయాన్ని పట్టించుకోకుండా ‘కుబేర’ కు జై అంటున్నారు. గతంలో  ఇలాంటి కథతో ‘చక్ దే ఇండియా’ ‘జెర్సీ’ ‘విజిల్’ ‘లగాన్’ లాంటి సినిమాలు చూసిన ప్రేక్షకులకు అమీర్ ఖాన్ కొత్త సినిమాలో వెరైటీ కనిపించడంలేదు. ‘చావా’ ‘యానిమల్’ ‘స్త్రీ 2’ లాంటి కమర్షియల్ కంటెంట్ ఈసినిమాలో లేకపోవడంతో మరొకసారి అమీర్ ఖాన్ కు పరాజయం ఎదురైంది అనుకోవాలి. వేల కోట్ల డబ్బు అవినీతి హత్యలు వ్యవస్థలో ఉండే పొరపాట్లుకు సంబంధించిణ వార్తలను ప్రతిరోజూ చదివే సగటు మనుష్యులకు సున్నితమైన కథలు నచ్చావు అన్న విషయం అమీర్ ఖాన్ కు అర్థం అయి ఉండాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: