తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ను అంతకుమించిన క్రేజ్ను సంపాదించుకున్న బ్యూటీలలో కృతి శెట్టి ఒకరు. ఈ బ్యూటీ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే రేంజ్ విజయాన్ని , అంతకుమించిన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటగా నటించిన మూడు సినిమాలతో మూడు విజయాలను అందుకొని ఒక్క సారిగా టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది.

కానీ బంగార్రాజు సినిమా తర్వాత ఈమె నటించిన సినిమాలు వరుస పెట్టి బాక్సాఫీస్ దగ్గర వరుసగా బోల్తా కొడుకు వచ్చాయి. ఆఖరుగా కృతి శెట్టి , శర్వానంద్ హీరోగా రూపొందిన మనమే అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ఈమెకు ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు చాలా వరకు తగ్గాయి. దానితో ఈమె తెలుగు సినిమాల్లో కంటే కూడా ఇతర భాష సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈమె కార్తీ హీరో గా రూపొందిన వా వాతియర్ అనే తమిళ సినిమాలో నటించింది. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు.

ఈమె నటించిన మరో తమిళ సినిమా లవ్ ఇన్సూరెన్స్ సెప్టెంబర్ 18 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ తో పాటు జీని అనే మరో తమిళ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. ఇక ఈ బ్యూటిఫుల్ పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందిస్తున్న ఖలీఫా సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇలా ఈ బ్యూటీ ప్రస్తుతం అనేక భాషల సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి కృతి శెట్టి తెలుగులో మాదిరి ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks