టాలీవుడ్ లో దాదాపు మూడు నాలుగు నెలల పాటు థియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. సరైన సినిమా లేక మంచి ఫీడింగ్ లేక సమ్మర్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇలాంటి టైంలో వచ్చిన నాగార్జున - ధనుష్ కుబేర సినిమా థియేటర్లకు మంచి ఫీడింగ్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ఇక ఈనెల 27న మంచి విష్ణు ప్రధాన పాత్రలో నటించి ... నిర్మాతగా వ్యవహరించిన కన్నప్ప సినిమా థియేటర్లోకి రాబోతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా హిట్ అయితే టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకి చాలా ఏళ్ల తర్వాత వారి రేంజ్‌కు తగిన హిట్ సినిమా గా కన్నప్ప రికార్డుల్లో నిలిచిపోతుంది.


వాస్తవంగా చెప్పాలంటే మంచు మోహన్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ హిట్‌ సినిమాల తర్వాత మంచు ఫ్యామిలీ వారసులు విష్ణు , మ‌నోజ్ నుంచి ఆ ఫ్యామిలీలో ఈ వారి రేంజ్‌కు త‌గ్గ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ద‌క్క‌లేదు. వీరిద్దరూ ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా చెప్పుకోవటానికి ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. కన్నప్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయితే ఈ మూమెంట్ మంచు ఫ్యామిలీ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది. ఈ తరంలోనూ మంచు ఫ్యామిలీకి మంచి క్రేజ్ వస్తుంది. అలాగే మంచు విష్ణుకు తొలి పాన్ ఇండియా సూపర్ హిట్ దక్కినట్లు అవుతుంది. ఆ ఫ్యామిలీకి ఇది మంచి మెమొరబుల్ సినిమాగా నిలిచిపోతుంది. ఈ క్రమంలో టాలీవుడ్ లో కుబేర తర్వాత థియేటర్లకు ఇండస్ట్రీకి మంచి బూస్టప్‌ ఇచ్చిన సినిమాగా కన్నప్ప నిలుస్తుంది. మరి కన్నప్ప తో విష్ణు ఏం ?చేస్తాడు అన్నది ఈనెల 27న తేలిపోనుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: