మంచు విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ , అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ , మోహన్ బాబు , కాజల్ అగర్వాల్ లాంటి అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీ నటులు నటించడంతో ప్రేక్షకులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడ విడుదల అయిన ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి టాక్ వచ్చింది. కానీ మంచు విష్ణు ఈ మధ్య కాలంలో నటించడం ఏ సినిమాకు కూడా రాని స్థాయి కలెక్షన్లు ఈ మూవీ కి మొదటి రోజు దక్కినట్లు తెలుస్తోంది.

దానితో ఈ మూవీ ని ప్రేక్షకులు అద్భుతమైన రీతిలో ఆదరించారు అనే ఉద్దేశంతో ఈ మూవీ యూనిట్ తాజాగా థాంక్స్ మీట్ ను నిర్వహించింది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ విలేకరులతో ముచ్చటించింది. తాజా విలేకరుల సమావేశంలో భాగంగా మంచు విష్ణు కు మీరు ఎందుకు కన్నప్ప సినిమా కోసం బాలీవుడ్ దర్శకుడుని ఎంచుకున్నారు ..? అనే ప్రశ్న ఎందుకు అయింది.

దీనికి మంచి విష్ణు సమాధానం చెబుతూ ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దర్శకులలో కన్నప్ప లాంటి సబ్జెక్టును ఎవరు నాతో తెరకెక్కించడానికి ముందుకు రారు అనే ఉద్దేశంతో నేను బాలీవుడ్ దర్శకుడితో ఈ మూవీ ని రూపొందించాలి అని అనుకున్నట్లు , అందులో భాగంగా మహాభారతం లాంటి ఒక గొప్ప సీరియల్ ను తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ను ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలకు ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే ముఖేష్ కుమార్ సింగ్ కూడా మేము అనుకున్న దాని కంటే అద్భుతంగా ఈ మూవీ ని రూపొందించినట్లు మంచు విష్ణు తాజాగా నిర్వహించిన థాంక్స్ మీట్ లో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: