దిల్ రాజు బ్యానర్ లో ఇప్పటికే ఎంతోమంది హీరోలు స్టార్లుగా మారారు. అలా ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న తాజా మూవీ తమ్ముడు.. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజా ప్రమోషన్స్ లో దిల్ రాజు, నితిన్ లు పాల్గొన్నారు. ఇందులో దిల్ రాజు మాట్లాడుతూ.. నువ్వు నేను దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాము. కానీ నువ్వే ఒక సంవత్సరం నా కంటే ముందు 2002 లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చావు. నేను 2003లో ఎంట్రీ ఇచ్చాను అంటే నాకంటే నువ్వే ఒక ఇయర్ సీనియర్.. ఇప్పటివరకు నువ్వు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 23 సంవత్సరాలు అవుతుంది.కానీ నేను అనుకున్న స్థాయిలో నువ్వు లేవు. ఆర్య సినిమాతో అల్లు అర్జున్ ని,దిల్ సినిమాతో నిన్ను చూసి మీరు ఇద్దరు ఫ్యూచర్లో స్టార్స్ అవుతారని అప్పుడే అనుకున్నాను.

 కానీ అల్లు అర్జున్ ఎదిగారు నువ్వు మాత్రం నేను అనుకున్నంత స్థాయికి ఎదగలేదు అంటూ దిల్ రాజు నీతిన్ ని అన్నారు. అంతే కాదు నేను అనుకున్న స్థాయిలో నువ్వు లేనందుకు నేను ఫీల్ అవుతున్నాను అని కూడా చెప్పారు.ఇక తమ్ముడు సినిమాతో ఆ హిట్టు కొట్టాలని, తమ్ముడు సినిమా మాత్రమే కాదు ఎల్లమ్మ సినిమాతో నువ్వు మరింత క్రేజ్ అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ దిల్ రాజు నితిన్ గురించి మాట్లాడారు. అయితే దిల్ రాజు చెప్పిన అన్ని మాటలు బాగానే ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ లా నువ్వు ఎదగలేకపోయావు అనే మాట మాత్రం ట్రోలింగ్ కి దారి తీసింది..

చాలామంది నెటిజన్లు దొరికిందే సందు అనుకొని అల్లు అర్జున్ లా ఎదగలేకపోయిన నితిన్ అంటూ అవమానించిన దిల్ రాజు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు ఒక హీరోని డైరెక్ట్ గా అలా ఎలా అనేసావయ్యా దిల్ రాజు అంటూ ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే దిల్ రాజుకి ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది నితిన్ నటించిన దిల్ సినిమాతోనే.ఈ సినిమా వల్లే దిల్ రాజు ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా కొనసాగారు

మరింత సమాచారం తెలుసుకోండి: