కాజల్ అగర్వాల్.. చందమామ లాంటి అందంతో మెరిసిపోయే కాజల్ అగర్వాల్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు.అయితే రీసెంట్ గా విడుదలైన కన్నప్ప సినిమాలో పార్వతి దేవి పాత్రతో అభిమానులను అలరించిన కాజల్ అగర్వాల్ త్వరలోనే ది ఇండియన్ స్టోరీ అనే సినిమాతో మళ్ళీ రాబోతోంది. అయితే అలాంటి ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరో ఎవరో చెప్పింది. అయితే చాలామంది నటీనటులు తమ పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూలలో తమకి ఇష్టమైన నటీనటుల గురించి డైరెక్టర్ల గురించి ఇలా తమకి ఇష్టమైన ప్రతి ఒక్కదాని గురించి బయట పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఇష్టమైన డైరెక్టర్లు, హీరో హీరోయిన్ల గురించి చెప్పడానికి తటపటాయిస్తారు. 

ఎందుకంటే బయటకు వెళ్లాక మళ్ళీ ఏ ప్రాబ్లం జరుగుతుందోనని.కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అలాంటి భయం ఏమి పడకుండా తనకు ఇష్టమైన హీరో ఎవరో పరోక్షంగా హింట్ ఇచ్చేసింది. మరి ఇంతకీ కాజల్ అగర్వాల్ మనసు దోచిన ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.గతంలో కాజల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో భాగంగా టాలీవుడ్ లో ఉన్న ఈ హీరోల లుక్స్ కి మీరు 10 కి ఎన్ని మార్కులు వేస్తారు అనే ప్రశ్న ఎదురవగా.. ప్రభాస్ కి 8/10, కళ్యాణ్ రామ్ కి 5/10, అల్లు అర్జున్ కి 6/10, జూనియర్ ఎన్టీఆర్ కి 6/10, రామ్ పోతినేని కి 7/10, రామ్ చరణ్ కి 7/10 ఇలా తాను కలిసి నటించిన అందరికీ పదికి ఎన్ని మార్కులు వేస్తుందో నిర్మొహమాటంగా చెప్పేసింది.

 అయితే వీరందరిలో చూస్తే కాజల్ అగర్వాల్ కి ప్రభాస్ లుక్స్ ఎక్కువగా నచ్చుతాయని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా ప్రభాస్ కి 8 మార్క్స్ ఇచ్చింది. ఇక కాజల్ ప్రభాస్ తో డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలు చేసిన సంగతి మనకు తెలిసిందే.. ముఖ్యంగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా షూటింగ్ సమయంలో కాజల్ అగర్వాల్ ప్లేస్ లో మొదట రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు. రెండు మూడు రోజులు షూటింగ్ చేశాక రకుల్ ప్రీత్ సింగ్ ప్రభాస్ కి సెట్ అవ్వట్లేదు అని ఆమెను తొలగించి కాజల్ అగర్వాల్ ని పెట్టుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: