కొన్ని సంవత్సరాల క్రితం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కామెడీ ప్లస్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రిలీజ్ సమయంలో బాక్సా ఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను  రాబట్ట లేకపోయినా ఆ తర్వాత ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ ని కొంత కాలం క్రితమే ఈ మూవీ బృందం వారు రీ రిలీజ్ చేసారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది.

చాలా మంది ఈ మూవీ కి సీక్వల్ ని రూపొందిస్తే బాగుంటుంది అని, దానిపై అద్భుతమైన రేంజ్ లో క్రేజ్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా ఈ మూవీ కి సీక్వల్ గా "ఈNఈ" అనే టైటిల్ తో మూవీ ని రూపొందించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా "ఈNఈ" సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే... ఈ మూవీ దర్శకుడు అయినటువంటి తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో నందమూరి నట సింహం బాలకృష్ణ తో చిన్న క్యామియో పాత్రను వేయించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు, అందులో భాగంగా బాలయ్య ను సంప్రదించగా ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మరియు బాలయ్య మధ్య కొన్ని నిమిషాల సన్నివేశం ఉండనున్నట్లు, దానిని అద్భుతమైన రీతిలో తరుణ్ భాస్కర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా బాలయ్య ఈ సినిమాలో భాగం కానున్నాడు అనే వార్త బయటకు రావడంతో ఒక్క సారిగా ఈ మూవీ పై  ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయికి చేరిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tb