ఇప్పుడంటే ప్రతి ఒక్కరిని హ్యాండ్ సమ్ హీరో అని పిలిచేస్తున్నారు . కానీ ఒకప్పుడు మాత్రం అలా కాదు కొంతమంది రేర్ గా ఉండే వాళ్ళని మాత్రమే హ్యాండ్సమ్ హీరో అని పిలుస్తూ ఉంటారు . వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు తరుణ్ - ఉదయ్ కిరణ్ . వీరిద్దరూ నటించిన సినిమాలు ఎంత బాగా అభిమానులను ఆకట్టుకున్నాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . "నువ్వే కావాలి ..నువ్వు లేక నేను లేను" ఇలాంటి సినిమాలతో మరింత ఫేమస్ అయిపోయాడు తరుణ్. అప్పట్లో తరుణ్ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోయే వాళ్ళు . ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ఏవైనా న్యూస్ పేపర్ లో వచ్చాయి అంటే అవి కట్ చేసుకుని మరి బుక్స్ లో దాచుకునే వాళ్ళు.


అప్పట్లో చాలా మంది అమ్మాయిల కాలేజ్ బుక్స్ ల లో తరుణ్ ఫొటోస్ ఎక్కువుగా  కనిపించేవి.  ఆ తర్వాత మెల్లి మెల్లిగా సినిమాలను మానేస్తే వచ్చాడు తరుణ్ . సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండడు . అరా కొరా ఆయనకి సంబంధించిన వార్తలు ఏమైనా అప్పుడప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి . కాగా ఇటీవల అమెరికా వెకేషన్ కి వెళ్ళిన టాలీవుడ్ హీరో లాస్ వేగాస్ లో సౌత్ కొరియా అగ్ర నటుడు డాన్ లీ ని కలిశాడు . అంతేకాదు కొద్ది సేపు ముచ్చటించారు.  ఆయనతో కలిసి ఫోటో దిగారు . దీంతో ఆ పిక్  కాస్త సామాజిక మాధ్యమాలలో బాగా ట్రెండ్ అవుతూ వచ్చింది.


ఆ ఫోటో చూసిన వాళ్లంతా షాక్ అయిపోతున్నారు . ఎందుకంటే నటుడు డాన్ లీ సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో తెరకెక్కే  ప్రభాస్ హీరోగా నటించే సినిమాలో  విలన్ గా నటిస్తున్నాడు. అలాంటి వ్యక్తితో తరుణ్ ఫోటో తీసుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.  తరుణ్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడేమో..? ఆ కారణంగానే ఇలా ఫోటో దిగారేమో..? అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . ఒకవేళ అదే నిజమైతే మాత్రం తరుణ్ కి మంచి కం బ్యాక్ హిట్ కన్ఫామ్ అని చెప్పాలి . దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు స్పిరిట్ సినిమా లో తరుణ్ నటిస్తున్నాడు అనే వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!!


మరింత సమాచారం తెలుసుకోండి: