
అప్పటినుంచి నిత్యం వార్తలలో ఆయన పేరు మారు మ్రోగిపోతూనే వచ్చింది . కాగా రీసెంట్గా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అమ్మాయిల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. " ఆడవాళ్లు కొన్ని విషయాలలో బుర్ర పెట్టి ఆలోచించాలి అని.. మగాడు చెడిపోతున్నాడు అంటే దానికి కారణం ఆడవాళ్లే అని ..మగవారికి న్యాయం జరగాలి అని ఢిల్లీలో పోరాటం కూడా చేశాను అని ఆ ఉద్యమాని మళ్లీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పుకొచ్చారు". "అంతేకాదు ఒక అమ్మాయి అబ్బాయిని ఈజీగా మోసం చేస్తుంది కానీ.. అబ్బాయి అమ్మాయిని ఎక్కువగా పట్టించుకోడు ..ఎంత బాధనైనా భరిస్తాడు ..అందుకే అమ్మాయిలకు తమ పేరెంట్స్ ముందు నుంచే కంట్రోల్లో ఉండే పద్ధతి నేర్పియాలి "అంటూ ఆడవాళ్ళపై షాకింగ్ కామెంట్స్ చేశారు .
"తల్లిదండ్రులు అమ్మాయికి ఏదైనా ధైర్యంగా ఉండేలా నేర్పించాలి .. అంతేకాదు నిజాయితీ గా ఉండేలా మాటలు చెప్పాలి.. తప్పైనా రైటైన చెప్పే విధానం తో పేరెంట్స్ పెంచాలి. ఎవరిని మోసం చేయకూడదు అనే విషయం ముఖ్యంగా నేర్పించాలి.. అప్పుడే ఆడవాళ్లు ఎటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడరు "అంటూ కూసింత ఘాటుగా స్పందించారు . ఈ మధ్య ఎంతో మంది అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు . అమ్మాయిలు కారణంగానే ఇదంతా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు . కాబట్టి అబ్బాయిలు అమ్మాయిల చేతుల్లో జాగ్రత్తగా ఉండాలి అంటూ సలహా ఇచ్చారు. దీంతో శేఖర్ బాషా పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఏర్పడిపోయింది . కొంతమంది ఈఅయన చేసిన కామెంట్స్ పై నాటీగా రియాక్ట్ అవుతుంటే. మరి కొంత మంది ఆడవాళ్లు మాత్రం ఘాటుఘాటుగా బూతులు తిడుతున్నారు. శేఖర్ బాషా మాట్లాడిన మాటలు పై కౌంటర్స్ వేస్తున్నారు..!!