
మరీ ముఖ్యంగా నితిన్ తన స్టోరీస్ సెలక్షన్స్ ని మార్చుకోవాలి అని ఎప్పుడు ఒకటే జోనర్ లో సినిమాలను చూస్ చేసుకుంటే ఇలానే ఉంటుంది రిజల్ట్ అంటూ హెచ్చరిస్తున్నారు . నిజానికి తమ్ముడు సినిమా కాన్సెప్ట్ పెద్ద కొత్తది ఏమి కాదు పాతదే . కొన్ని కొన్ని పాయింట్స్ హైలెట్ అవ్వడం వల్ల కొన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి . నితిన్ తన రోల్లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించినా కానీ ప్రతిసారి ఆయనని ఇలాంటి తరహా క్యారెక్టర్ లో చూస్తూనే రావడంతో ఈ రోల్ లో నితిన్ ని చూసి బోర్ కొట్టేసింది అభిమానులకి.
ఇక వర్ష బొల్లమ్మ క్యారెక్టర్ బాగా ప్లస్ గా మారింది. అలాగే లయ క్యారెక్టర్ కూడా బాగా ప్లస్గా మారింది అని చెప్పాలి . మెయిన్ ఈ సినిమా ఫ్లాప్ టాక్ దక్కించుకోవడానికి కారణం కథనం . సినిమాకి పెద్ద మైనస్ అయింది . ఆడియన్స్ కి ఉత్కంఠ కలిగించే మూమెంట్స్ ఎక్కడ లేవు. థియేటర్లో సీన్ వెళ్తుంటే ఈ తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటో అని జనాలు ఈజీగా చెప్పొచ్చు. అంత బోరింగ్ గా ఉంటుంది . సినిమా ఫస్ట్ అఫ్ ఓకే ఏదో కొంచెం కొంచెం పర్లేదు అనుకుంటే సెకండ్ ఆఫ్ అయినా బెటర్ గా ఉంటుంది అనుకున్నారు అభిమానులు. కానీ అది కూడా లేదు . లాజిక్ లేకుండా కొన్ని డిసప్పాయింట్ సీన్స్ తో సినిమాను తుతూ మంత్రంగా లాక్కొచ్చాడు వేణు శ్రీరామ్ అన్న కామెంట్స్ కూడా వినిపించాయి . అంతేకాదు ఈ సినిమా మొత్తానికి మెయిన్ డిజాస్టర్ పాయింట్ ఏంటి అంటే మాత్రం కథనం .
కథనం పెద్దగా బాగోలేదు . అంతేకాదు నితిన్ పాత్ర మొటివ్ తో స్టార్ట్ అయిన ఆ తర్వాత అందులో క్లారిటీ మిస్ అవుతుంది . ఇక విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా అనిపించదు . అదేవిధంగా సప్తమి గౌడ పై కొన్ని కొన్ని సీన్స్ డైలాగ్స్ చిరాకు తెప్పిస్తాయి. హెడేక్ అనిపిస్తుంది . సినిమా ఇంకో పెద్ద మైనస్ సంగీతం . పాటలు పర్లేదు అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూర్తిగా విసుగు తెప్పించింది. ఆల్రెడీ ఎక్కడో వినేసినట్టే ఉంది . సినిమా డిజాస్టర్ కావడానికి మెయిన్ పాయింట్స్ ఇవే . ఒకవేళ ఇవన్నీ ప్లస్ గా మారి ఉంటే మాత్రం నితిన్ కచ్చితంగా హిట్ కొట్టేవాడు. తన నటనతో ఈ సినిమాని హిట్ కొట్టేలా ప్రయత్నించిన నితిన్ మాత్రం ఆ విషయంలో పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు అంటున్నారు సినీ ప్రముఖులు..!!