
నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లోనే ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బాలయ్య నటించిన చివరి నాలుగు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అఖండతో మొదలు పెట్టిన బాలయ్య విజయాల పరంపర వరుసగా అఖండ - వీరసింహారెడ్డి - భగవంత్ కేసరి - డాకూ మహారాజ్ సినిమాలతో దూసుకు పోతోంది. అయితే ఈ నాలుగు సినిమాలు ఏపీలోన ఒక సెంటర్లో 175 రోజులు ఆడడం రికార్డుగా నిలిచింది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట అంటేనే బాలయ్య సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఈ సెంటర్లోని రామకృష్ణ - వెంకటేశ్వర థియేటర్లలో బాలయ్య , నందమూరి హీరోలు నటించిన చాలా సినిమాలు 100 రోజులు ఆడాయి.
కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ సినిమా పటాస్ , అటు బాలయ్య ప్లాప్ సినిమా లయన్ కూడా ఇక్కడ సెంచరీ కొట్టేశాయి. ఇక అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు సినిమాలు ఇక్కడ 175 రోజులు పూర్తి చేసుకున్నాయి. తాజాగా డాకూ మహారాజ్ సినిమా సైతం ఈ సెంటర్లోని వెంకటేశ్వర థియేటర్లో 175 రోజులు పూర్తి చేసుకుంది. అటు రాయలసీమ లోని నంద్యాల - ఆదోని - ప్రొద్దుటూరు సెంటర్ల తో పాటు ఇటు చిలకలూరిపేట సెంటర్ కూడా బాలయ్య సినిమా లకు కంచుకోట గా నిలుస్తోంది. ఇక బాలయ్య ప్రస్తుతం నటిస్తోన్న అఖండ 2 - తాండవం సినిమా ఈ యేడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు