
ఇక ఇప్పుడు టాలీవుడ్ లో నితిన్ తమ్ముడు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సప్తమి గౌడ .. ఇందులో చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ .. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ దిల్ రాజు బ్యానర్ కావడం తో ఆఫర్ ను కాదనలేకపోయింది .. ఇలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన తమ్ముడు మొదటి షో తోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది .. తొలి రోజు మొదటి ఆట నుంచి నెగటివ్ టాక్ వచ్చింది .. ఈ విషయం ఇలా ఉంచితే సప్తమి గౌడ క్యారెక్టర్ ప్రధానంగా సినిమాలో ప్రేక్షకులకు చిరాకు పెట్టించిందని కామెంట్స్ కూడా వచ్చాయి ..
అటు సినిమా ఫ్లాఫై ఇటు తన పాత్ర పట్ల నెగటివ్ టాక్ రావడం తో తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాలనుకున్న ఈ కన్నడ బ్యూటీ కి గట్టి షాక్ తగిలింది .. ప్రస్తుతం సప్తమి తమిళం , కన్నడ తో పాటు హిందీ లో థామా సినిమాలో కనిపించబోతుంది .. ఆయుష్మాన్ ఖురానా , రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో సప్తమి కనిపించబోతుంది .. ఇక మరి టాలీవుడ్ లో రాణించాలని అనుకున్న సప్తమి కి తర్వాత ఆఫర్ ఎవరిస్తారు ఎప్పుడు వస్తుంది అనేది కాలమే చెప్పాలి ..