నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే `కుబేర` మూవీతో మరో హిట్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తోంది. సినిమాలు గురించి పక్కన పెడితే.. రష్మిక ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. సాధారణంగా సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడతారు. ఎందుకంటే పొరపాటున ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏకిపారేస్తార‌ని.


కానీ రష్మిక మాత్రం నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తోంది. తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడమే పనిగా పెట్టుకుంది. ముఖ్యంగా తన సొంత గడ్డ అయిన కన్నడ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడి పలుమార్లు కన్నడిగుల ఆగ్రహానికి గురైంది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంది. అయిన కూడా ఆమెలో ఏ మార్పుల రాలేదు. తాజాగా మ‌రోసారి నోరు జారింది.


ఒక ఇంటర్వ్యూలో ర‌ష్మిక మాట్లాడుతూ.. తాను కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చానని ర‌ష్మిక చెప్పుకొచ్చింది. ఇది చెప్ప‌డంలో ఎటువంటి త‌ప్ప‌లేదు. కానీ ర‌ష్మిక ఒక అడుగు ముందుకేసి.. కొడవ కమ్యూనిటీ నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి సెటిల్ అయిన ఏకైక హీరోయిన్ తానే.. ఇప్పటివరకు ఎవరు త‌మ‌ కమ్యూనిటీ నుంచి రాలేదని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. దీంతో కన్నడిగులు మ‌రోసారి ర‌ష్మికను ట్రోల్ చేయ‌డం షురూ చేశారు. నటి ప్రేమ నీక‌న్నా ముందే కొడవ కమ్యూనిటీ నుంచి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి స్టార్డ‌మ్ అందుకుంది.. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో ఆమె ఎన్నో సినిమాలు చేసింద‌ని ర‌ష్మిక‌కు గుర్తు చేస్తున్నారు. హర్షిక పూనాచ, శుభ్ర అయ్యప్ప, నిధి సుబ్బయ్య కూడా కొడవ కమ్యూనిటీకి చెందిన వారే.. కేవ‌లం నీ గొప్ప‌లు చెప్పుకోవ‌డం కోసం నోటికొచ్చిన‌ట్లు మాట్లాకు అంటూ ర‌ష్మిక‌కు క‌న్న‌డిగులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: