`సీతా రామం` సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారింది మృణాల్ ఠాకూర్‌. ఆ త‌ర్వాత ఈ బ్యూటీ చేతి నిండా సినిమాల‌తో ఎంత బిజీగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. హిందీతో పాటు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు అందుకుంటూ బిజీ షెడ్యూల్‌ను మెయింటైన్ చేస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో అడివి శేష్‌కు జోడిగా `డెకాయిట్` చిత్రంలో న‌టిస్తోంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెర‌కెక్కించ‌బోయే `ఏఏ22`లోనూ మృణాల్ ఆఫ‌ర్ అందుకుంద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్ లో దాదాపు మూడు ప్రాజెక్ట్స్ లో ఈ సుందరి భాగ‌మైంది.


సినిమాల సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంది. చిన్నతనంలోనే నటి కావాలని మృణాల్ నిర్ణయించుకుంద‌ట‌. కానీ అందుకు ఆమె తల్లిదండ్రులు మొదట అంగీకరించలేదు. సినిమా రంగంపై ఉన్న అపోహలే అందుకు కారణం. కానీ మృణాల్ మాత్రం తన మనసు మార్చుకోలేదు. తల్లిదండ్రులను ఒప్పించి ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. మృణాల్ సినిమాల్లోకి రావడానికన్నా ముందు ప‌లు టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేసింది.


`కుంకుమ రేఖ` సీరియల్ మృణాల్ కు మంచు గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే సినిమాల్లో అవకాశాల కోసం ఆడిషన్స్ కు వెళ్లినప్పుడు టీవీ నటి అనే ట్యాగ్ తో చాలామంది చులకనగా చూసేవార‌ట‌. అవహేళన చేసేవార‌ట‌. దాంతో కొన్నిసార్లు డిప్రెషన్ కి గురై తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకేసి సూసైడ్ చేసుకోవాలని కూడా మృణాల్‌ అనుకునేదట. కానీ తల్లిదండ్రులను గుర్తొచ్చి వెనకడుగు వేశానని తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ లోని చేదు నిజాల‌ను బయటపెట్టింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: