తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. కొంత కాలం చైతన్య "తండల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీలోని చైతన్య నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం చైతన్య "విరూపాక్ష" మూవీ దర్శకుడు అయినటువంటి కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

నాగ చైతన్య హీరో గా నటిస్తున్న మూవీ కావడం , అద్భుతమైన విజయం సాధించిన విరూపాక్ష మూవీ దర్శకుడు కార్తీక్ దండు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా చైతన్య మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ మూవీ చైతన్య తమిళ దర్శకుడితో చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో చైతన్య తన నెక్స్ట్ మూవీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పి ఎస్ మిత్రన్ ఇప్పటికే అభిమన్యుడు , సర్దార్ అనే సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈయన దర్శకత్వంలో చైతన్య తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కొంతకాలం క్రితం చైతన్య తమిళ దర్శకుడు అయినటువంటి వెంకట్  ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అపజయాన్ని అందుకుంది. అయినా కూడా మరోసారి చైతన్య తమిళ దర్శకుడికి అవకాశం ఇస్తూ ఉండడంతో చైతన్య కాస్త రిస్క్ చేస్తున్నాడా అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం నాగ చైతన్య ఒక వేళ తన తదుపరి మూవీ ని  పి ఎస్ మిత్రన్ తో చేస్తే ఈ సారి తమిళ దర్శకుడితో మంచి విజయాన్ని అందుకుంటాడు అనే ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc